జైస‌ల్మేర్ లో కూలిన మిగ్-21.. పైల‌ట్ మృతి

-

రాజ‌స్టాన్ రాష్ట్రంలోని జైస‌ల్మేర్ లో ఐఏఎఫ్ మిగ్ – 21 విమానం కుప్ప కూలింది. ఈ ప్ర‌మాదంలో పైల‌ట్ మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న శుక్ర వారం రాత్రి చోటు చేసుకుంది. మృతి చెంద‌ని పైల‌ట్ వింగ్ క‌మాండ‌ర్ హ‌ర్షిత్ సిన్హా గా గుర్తించారు. అయితే శుక్ర‌వారం రాత్రి 8 : 30 గంట‌ల‌కు వింగ్ క‌మాండర్ హ‌ర్షిత్ సిన్హా ఐఏఎఫ్ మిగం- 21 విమానం శిక్ష‌ణ స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జరింగిద‌ని జైస‌ల్మేర్ ఏస్పీ అజ‌య్ సింగ్ తెలిపారు. ఇండో – పాక్ స‌రిహ‌ద్దు స‌మీపం లోని సుదాసిరి గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని తెలిపారు.

అలాగే మిగ్ -21 కూలిపోక ముందే.. విమానంలో నుంచి మంట‌లు వ‌చ్చాయని అక్కడ ప్ర‌త్యేక్ష సాక్షి చెప్పార‌ని తెలిపారు. భూమిని ఢీ కొట్టక ముందే మంట‌లు రావ‌డంతో హ‌ర్షిత్ సిన్హా మ‌ర‌ణించి ఉంటాడ‌ని అంచనా వేస్తున్నారు. అయితే ఐఏఎఫ్ మిగ్ -21 విమానంలో మంట‌లు రావడానికి గ‌ల కార‌ణం తెలియాల్సి ఉంద‌ని అన్నారు. అయితే ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించి వింగ్ క‌మాండ‌ర్ హ‌ర్షిత్ సిన్హా కుటుంబానికి రాజ‌స్థాన్ ముఖ్య మంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ క‌ల్ రాజ్ మిశ్రా సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news