ఏపీ ప్రజలకు ఆర్టీసీ బిగ్ షాక్..సంక్రాంతికి 50 శాతం అదనపు ఛార్జీలు

-

ఏపీ ప్రజలకు ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సంక్రాంతికి 1266 ప్రత్యేకంగా బస్సులు నడుపనున్న ఆర్టీసీ… 50 శాతం అదనపు ఛార్జీలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన్నట్లు.. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.

జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరుకు 14, చెన్నైకు 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు ఆర్టీసీ అధికారులు. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ- రాజమహేంద్రవరం మధ్య 360 బస్సులు ఏర్పాటు చేశామని… ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడుస్తాయని తెలిపారు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సుల్లో 50శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు చెప్పారు ఆర్టీసీ అధికారులు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించినట్టు.. ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news