తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త జోనల్ వ్యవస్థ పై మార్గదర్శకాలు విడుదల

-

ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ చెప్పింది. కొత్త జోనల్ వ్యవస్థ జీఓ 317 ప్రకారం అలాట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల కు పోస్టింగ్స్ పై మార్గదర్శకాలు విడుదల చేసింది సర్కార్. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగ్‌లపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. తాజా కేటాయింపు లో ఉద్యోగి, ఉపాధ్యాయుడు ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాకే కేటాయించబడితే వారు ప్రస్తుతం పని చేస్తున్న చోటనే పోస్టింగ్ ఇచ్చినట్టేనని ఇందులో పేర్కొంది. ఎవరైతే ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాకు కాకుండా కొత్త జిల్లాకు కేటాయించబడితే కౌన్సెలింగ్ ద్వారా పోస్టింగ్ ఉండనుంది.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

కొత్తగా కేటాయించబడ్డ వారి సీనియారిటీ లిస్ట్ ప్రకారం బదిలీలు, పోస్టింగ్స్ జరుగనున్నాయి. జిల్లా కలెక్టర్ , సంబంధిత శాఖ జిల్లా అధికారితో కమిటీ వేసింది. కమిటీ లో టీఎన్జీవో, టిజిఓ ప్రతినిధులు… ఇతర గుర్తింపు పొందిన యూనియన్ ల ప్రతినిధులు ఉందనున్నారు. ఉద్యోగుల నుండి ఆప్షన్స్ తీసుకోనున్న కమిటీ.. కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్స్ ఇవ్వనుంది. వారం రోజులలో ఈ ప్రక్రియ అంత పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోస్టింగ్ ఇచ్చిన మూడు రోజుల తర్వాత ప్రస్తుతం పని చేస్తున్న చోట నుండి రిలీవ్ అయినట్టేనని.. కొత్త పోస్ట్ లో రిపోర్ట్ చేయక పోతే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది. జోనల్‌,మల్టీ జోనల్‌ పోస్టులకు విడిగా మార్గదర్శకాలు ఇవ్వనున్న సర్కార్… పోలీస్‌, ఎక్సైజ్‌, స్టాంపులు, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌ శాఖలు అవసరమైతే విడిగా మార్గదర్శకాలు జారీ చేసుకోవచ్చని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news