‘చావు’ తెలివితేటలు .. వాడకండి నాయనా .. దొరికితే లోపలేస్తారు..!!

-

కరోనా కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం వల్ల చాలామంది అనేక అవస్థలు పడుతున్నారు. పేద మరియు మధ్యతరగతి అదేవిధంగా వలస కూలీల కష్టాలు అయితే వర్ణణాతీతం. ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది. తిరిగి ఇంటికి వెళ్లి పోదామన్నా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో కొంతమంది వలసదారులు కాలినడకన కొన్ని వందల కిలోమీటర్ల నడవటానికి సిద్ధ పడుతుంటే మరికొంతమంది చావు తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఒక బ్యాచ్ సొంత ఊరికి వెళ్లాలని వేసిన స్కెచ్ తో పోలీసులకు అడ్డంగా దొరికిపోయి బుక్ అయిపోయారు.Coronavirus Latest Updates: 3 fresh cases reported from Ladakh ...పూర్తి వివరాల్లోకి వెళితే జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో సొంత ఊరు వెళ్ళటానికి ముగ్గురు వ్యక్తులలో ఒకరు చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ పుట్టించి, వారిలో ఒకరు శవంగా నటించడానికి రెడీ అయి అంబులెన్స్ వేసుకొని బయల్దేరారు. చాలా చెక్ పోస్టులు వద్దా పోలీసులను బురిడీ కొట్టించిన ముగ్గురు…ఇంకా ఎదురు లేదు ప్లాన్ వర్కౌట్ అయింది ఇంటికి వెళ్లిపోయినట్లే అని ఆలోచిస్తుండగా… సూరన్ కోట్ చెక్‌పోస్ట్‌‌కు చేరుకోగానే చెకింగ్ కోసం ఆపిన పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చి అంబులెన్స్ ను తనిఖీ చేసి, అందులో శవంలా ఉన్న వ్యక్తికి టెంపరేచర్ టెస్ట్ చేయగా అతను బతికే ఉన్నాడని తెలిసింది.

 

దీంతో వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వ్యాన్ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలించారు. మామూలుగా అయితే వలస కూలీల ను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో చాలా రాష్ట్రాలలో వలస కూలీ లకు ప్రత్యేకమైన షెల్టర్ ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలాంటి టైములో ఎక్కడి వారు అక్కడ ఉంటే బాగుంటుందని దొరికితే లోపలేస్తారని ప్రభుత్వాలు చెబుతున్నా గాని చాలా మంది వలసదారులు చావు తెలివితేటలు ఉపయోగించి బుక్ అయిపోతున్నారు.  దొరికితే లోపలేస్తారు అని చెబుతున్నా కంటైనర్ లారీలలో పెద్ద పెద్ద లోడ్ కలిగిన లారీలలో బయలుదేరుతూ పోలీసులకు బుక్ అయిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news