టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్స్ తగ్గిస్తారా …తగ్గించుకుంటారా ..?

-

తెలుగు చిత్ర పరిశ్రమ ఇంతకముందెప్పుడు కనీ వినీ ఎరగని విధంగా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అన్నీ భారీ పరిశ్రమలు అగాధం లోకి వెళ్ళి పోయాయి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ కి దాదాపు సంవత్సరం ఆటు ఇది కోలుకోలెని దెబ్బ. ఈ ప్రభావం ప్రైఇ ఒక్కరి మీద దారుణంగా పడింది. రోజు వారి కార్మీకుడి నించి భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించే నిర్మాతల వరకు రూపాయి గురించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి.

 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు. థియేటర్స్ తెరిచినా జనాలు సినిమా చూడటానికి థియేటర్స్ కి వస్తారా లేద అన్నది అనుమానమే. ఇక సినిమాలు కొన్ని రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. కాని ఆ సినిమాలని రిలీజ్ చేసే పరిస్థితిలో నిర్మాతలు లేరని తెలుస్తుంది. అసలు ధైర్యం చేస్తారా అన్నది అర్థం కావటం లేదు.

ముఖ్యంగా ఇప్పటికే కమిటయిన సినిమాలకి సగం రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోల పరిస్థితి చెప్పతరం కాకుండా ఉంది. అంతేకాదు ఇప్పటి నుంచి సినిమా నిర్మించాలంటే చిన్న హీరో నుండి స్టార్ హీరోల వరకు రెమ్యూనరేషన్ నిర్మాతలు తగ్గిస్తారా లేదా హీరోలే పరిస్థితులని అర్థం చేసుకొని తగ్గించుకుంటారా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. హీరోలు గనక నిజంగా తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటే నిర్మాతలకి కాస్త ఊరట కలుగుతుంది. నెమ్మదిగా సినిమాలని నిర్మించడానికి మళ్ళీ ధైర్యం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news