“నువ్విలా” అనే సినిమా లో చిన్న పాత్రతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో ఆరంగేట్రం చేశాడు.ఆ తరువాత వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా లోని రిషి పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అప్పటి నుండి ఇప్పటివరకు వరుస సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు.అయితే తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే “లైగర్” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో రానున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం మైక్ టైసన్ ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తండ్రిగా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ భారీ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.