LIGER : లైగర్ నుంచి బిగ్ అప్డేట్…మైక్‌ టైసన్‌ వచ్చేశాడు

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లో చాలా తక్కువ టైం లోనే స్టార్‌ హీరోగా ఎదిగాడు విజయ్‌ దేవర కొండ. అర్జున్‌ రెడ్డి సినిమా తో యూత్‌ లో ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న విజయ్‌ దేవర కొండ… అప్పటి నుంచి మంచి విజయాలను అందుకున్నాడు. నటుడు గానే కాకుండా బిజినెస్‌మేన్‌గానూ ఫుల్‌ ఫామ్‌లో ఉన్న దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న తాజా మూవీ ”లైగ‌ర్”.

స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్‌తో తెర‌కెక్కనున్నఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను ఛార్మి, కరణ్ జోహార్లు కలిసి నిర్మిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఏవిధంగా ఉండ‌బోతుంద‌న‌నే ఆస‌క్తి సినీ అభిమానులకు ఉంటుంది. అయితే.. ఈ లైగర్‌…సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్ వచ్చింది. దీపావళి కానుకగా.. ఈ సినిమా లో మైక్‌ టైసన్‌ పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. మైక్‌ టైసన్‌ బ్యాక్సింగ్‌ కు సిద్ధమన్నట్లు లుక్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ లో మైక్‌ టైసన్‌.. చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. ఇక ఈ అప్‌ డేట్ తో విజయ్‌ దేవర కొండ ఫ్యాన్స్‌ లో కొత్త ఉత్సాహం నెలకొంది.