తెలంగాణలో శుక్రవారం అర్ధరాత్రి భూమి స్వల్పంగా కంపించింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూకంపం వచ్చింది. వాటితో పాటు మహారాష్ట్ర బార్డర్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో.. ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తారు. భూకంప తీవ్రత, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలోని నాందేడ్, యావత్మాల్ జిల్లాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.