రోజాకు షాకిచ్చిన జగన్.. ఆ పదవి రానట్టేనా?

-

మరోవైపు ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కని వారికి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు చాన్స్ దొరుకుతుందని అంతా భావించారు. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ క్లూ ఇచ్చారు. దీంతో కొందరు ఆశావహులు అప్పుడైనా మంత్రి పదవి రాకపోతుందా? అని ఎదురు చూస్తున్నారు.

వైఎస్సార్సీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా రోజులు బాగాలేనట్టున్నాయి పాపం. ఆమె అనుకున్న పదవేమీ ఆమెకు దక్కడం లేదు. ముందుగా ఆమెకు ఖచ్చితంగా మంత్రి పదవిని సీఎం జగన్ ఇస్తారని అనుకున్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆమెకు చోటు కల్పించలేదు. దీంతో ఆమె అలగడం.. జగన్ వెంటనే ఏపీఐఐసీ చైర్మన్‌గా ఎంపిక చేయడం చకచకా జరిగిపోయాయి.

అంతే కాదు.. ఆమెను నవరత్నాల అమలు కమిటీకి చైర్మన్‌గానూ నియమించనున్నట్లు తెలుస్తోంది. నవరత్నాల పథకాన్ని పర్‌ఫెక్ట్‌గా అమలు చేయడం కోసం ఆమెకు చైర్మన్ పదవి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే ఏపీఐఐసీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిగా ఉన్నారు. కొన్ని రోజుల్లో నవరత్నాల కమిటీకి కూడా చైర్మన్‌గా ఎంపికయితే.. ఆమె బిజీబిజీగా గడపాల్సి వస్తుంది.

మరోవైపు ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కని వారికి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు చాన్స్ దొరుకుతుందని అంతా భావించారు. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని జగన్ క్లూ ఇచ్చారు. దీంతో కొందరు ఆశావహులు అప్పుడైనా మంత్రి పదవి రాకపోతుందా? అని ఎదురు చూస్తున్నారు. అందులో రోజా కూడా ఉండటం గమనార్హం. అయితే.. రెండున్నరేళ్ల తర్వాత విస్తరించే మంత్రివర్గంలోనూ రోజాకు చాన్స్ వచ్చే అవకాశమే లేదట. ఆమెకు ఈ టర్మ్‌లో అసలు మంత్రి పదవి రావడమే కష్టమట. ఎందుకంటే.. సామాజిక కారణాలేనట. చిత్తూరు నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నారు. భూమనా కరుణాకరన్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. ఒక చిత్తూరు జిల్లా నుంచే ఒకరు మంత్రి, మరొకరు మంత్రి పదవి రేస్‌లో ఉండటంతో వాళ్లను కాదని రోజాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశమే లేదట. అందుకే జగన్.. రోజాకు వేరే పదవులు ఇచ్చి సంతృప్తి పరచాలని భావిస్తున్నారట. అందుకే.. ఇప్పటికే ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చారు. కొన్ని రోజుల్లో నవరత్నాల కమిటీకి అధ్యక్షురాలిని చేయనున్నారు. అది మ్యాటర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version