ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు: తలుచుకుంటే రెండు నెలల్లో తెరాస ప్రభుత్వాన్ని కూలుస్తాం

మజ్లిస్ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మేము తలుచుకుంటే రెండు నెలల్లోనే టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూల్చేస్తాం అని ఆయన హెచ్చరించారు. కేటీఆర్ చిలక నిన్న మొన్న రాజకీయాల్లో కళ్ళు తెరిచాడు అని ఆయన ఎద్దేవా చేసారు. మా అధినేత చెప్పినట్టు రాజకీయం మా ఇంటి గుమస్తా తో సమానం అని ఆయన పేర్కొన్నారు.Mumtaz Ahmed Khan Pro-tem Speaker, Owaisi Grateful To KCR

తెలంగాణాలో మజ్లీస్ పార్టీ, తెరాస పార్టీ చాలా వరకు సన్నిహితంగానే ఉంటున్నాయి అనే వ్యాఖ్యలు ఉన్నాయి. ఒవైసీ కుటుంబంతో సిఎం కేసీఆర్ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. ఈ వ్యాఖ్యలు ఏ మలుపు తిరుగుతాయో ఆసక్తి పెరిగింది. బిజెపి కూడా తెరాస, మజ్లీస్ స్నేహంపై వ్యాఖ్యలు చేస్తున్నాయి.