నేడు, రేపు ప్రధాని మోడీ ఏపీలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, పవన్‌లు భేటీ కానున్నారు. దీంతో ఈ భేటీపై రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇదేమంత చర్చనీయాంశం కాదని పేర్కొన్నారు. రాజకీయల్లో ఇలాంటి భేటీలు సహజమేనని అభిప్రాయపడ్డారు మంత్రి బొత్స. నేతలు ఒకరినొకరు కలుసుకోవడంలో ఆశ్చర్యమేముందని, రాజకీయాల్లో ఇవి రొటీన్ అని అన్నారు మంత్రి బొత్స. మోదీతో పవన్ సమావేశమైతే తామెందుకు స్పందించాలని ప్రశ్నించారు మంత్రి బొత్స. ఈ భేటీని భూతద్దంలో చూడాల్సిన పనిలేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
గతంలో పవన్ ఢిల్లీలో మోదీని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకలేదు అంటూ ఓ మీడియా ప్రతినిధి బొత్సను అడగ్గా, అవన్నీ ఆయా పార్టీల అంతర్గత వ్యవహారాలు అని, వాటిపై తామెలా స్పందిస్తామని బొత్స బదులిచ్చారు. ‘నేనేమైనా వారి పార్టీకి సంబంధించిన వాడ్నా… అలాంటి విషయాలపై నేను మాట్లాడను’ అని కరాఖండీగా చెప్పేశారు మంత్రి బొత్స.