రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో బండి పడ్డారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భూకబ్జా చేశానని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తన తండ్రి 1600 ఎకరాలు సంపాదించారని.. ఇప్పుడు 100 ఎకరాలు మిగిలిందని అన్నారు.

ప్రజల్లో మీకు స్పందన లేదని, మీ పాదయాత్ర బంద్ చేయాలంటే నిమిషం పట్టదని కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ షర్మిల, రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలు తుపాకీ వెంకటి రాముని లా ఉంటాయని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి ది బ్లాక్ మెయిల్ చేసే చరిత్ర అంటూ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పై కానీ, రాఘవరెడ్డి పై ఒక్క కేసు కూడా లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version