గిరిజన రిజర్వేషన్ పెంపుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణ గిరిజన రిజర్వేషన్ పెంపు ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. గిరిజన రిజర్వేషన్ పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ పెంపు విషయంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోను సవాలు చేస్తూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చని సూచిస్తూ విచారణను ముగించింది.

గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవో చట్టబద్ధం కాదని, జీవో వల్ల ఆదివాసీలకు నష్టం జరుగుతుందంటూ పలు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం ఈ విధంగా వ్యాఖ్యానించింది. కొత్త జీవోతో రిజర్వేషన్లు 50% దాటుతాయని ఆదివాసీ సంఘాలు చెబుతున్నాయి. అంతేకాదు చెల్లప్ప కమిషన్ 9% వరకే రిజర్వేషన్లు పెంచుకోవాలని సూచించిందని ఆదివాసీ సంఘాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో జీవోను సవాల్ చేయాలని సూచించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version