చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు : గుడివాడ అమర్నాథ్‌

-

విశాఖపట్నంలో వచ్చే ఏడాది జనవరిలో ఐటీ సమ్మిట్‌ను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ఐటీ అసోసియేషన్‌ (ఐటాప్‌), ఏపీఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఏపీఐఎస్‌, ఎస్‌టీపీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్ఫినిటీ వైజాగ్‌-2023 ఐటీ సమ్మిట్‌ పోస్టర్‌, వెబ్‌సైట్‌ని మంత్రి అమర్‌నాథ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరి 20, 21 తేదీల్లో స్థానిక మారియట్‌ హోటల్‌లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి రోజున ఎస్‌టీపీఐ ద్వారా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, స్టార్టప్‌లతో పాటు ఐటీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. రెండో రోజు బిబినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీపీఎం)తో పాటు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలపై ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు, ఐటీ రంగ నిపుణులు చర్చిస్తారని తెలిపారు.

అంతేకాకుండా.. చంద్రబాబు నాయుడుకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు ఇప్పుడు ప్రత్యేకంగా చివరి ఎన్నికలు ఏంటి? చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎవరికి నష్టం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుకి, టీడీపీకి ఇవే ఆఖరి ఎన్నికలు అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని, రాయలసీమ ప్రజలు ప్రశ్నిస్తే… కొట్టమని చెప్తారా ? అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఆయన పార్ట్నర్ ల గురించి జనానికి తెలుసు అని, ఇప్పటికైనా 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పగలరా ? అని ఆయన ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version