తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. త్వరలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని.. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులు భర్తీ చేస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. బాన్సువాడలో 40 కోట్లతో నర్సింగ్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి హరీష్ రావు భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కేంద్రానికి ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తాయి..టిఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్న కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతుందన్నారు.
కర్ణాటకలో బీజేపీ రూ.600 ఇస్తున్నారు… కేసీఆర్ గారు మనకు రూ .200 ను రూ 1000 చేశారని హరీష్ రావు అన్నారు. ఆ తర్వాత 2016 రూపాయలు చేసారు. రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్లు వస్తాయని… 57 ఏళ్లు పూర్తయిన వారికి పెన్షన్ ఇస్తామని ప్రకటన చేశారు హరీష్ రావు.