రాష్ట్ర పునరేకీకరణ తెలివి తక్కువ ఆలోచన అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నాడు బలవంతంగా తెలంగాణను ఏపీతో కలిపారన్నారు. 20ఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ ఆవిర్భావం జరిగిందని తెలిపారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అభివృద్ధిలో ముందుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఇక సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒకప్పుడు కలిసున్న మద్రాసులో మళ్లీ ఏపీని కలుపుతారా? అని మంత్రి ప్రశ్నించారు. అంతేకాకుండా… బీజేపీకి రాహుల్ గాంధీనే పెద్ద కార్యకర్తగా మారాడన్నారు. ఇది దేశ ప్రజల దురదృష్టమని, గుజరాత్ లో బీజేపీ చరిష్మా పనిచేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యమే బీజేపీకి కలిసి వచ్చిందని, ప్రజావ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
ఒక్క హామీ నెరవేర్చకుండా,ప్రతిపక్షాలు లేకుండా గెలవడం బీజేపీ నైజమని మంత్రి విమర్శించారు. దిక్కులేని స్థితిలో గుజరాత్ ప్రజలు బీజేపీకి ఓటేశారని, పాలన సరిగా లేకున్నా గుజరాత్ లో బీజేపీ విజయం సాధించిందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అద్భుతమైన పథకాలు,ఆదర్శవంతమైన పాలనతో తెలంగాణలో టీఆర్‌ఎస్ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.