శ్రీశైలంలో ప్రసాదం స్కీం పనులను పరిశీలించిన మంత్రి కిషన్ రెడ్డి

-

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పూజల అనంతరం శ్రీశైలంలో ప్రసాద స్కీం పనులను పరిశీలించారు. ప్రసాదం స్కీం పనులన్నీ వచ్చే నెలలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శ్రీశైలానికి రైల్వే మార్గం తీసుకురావడానికి రైల్వే మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి రైల్వే మంత్రిని కూడా తీసుకొస్తానన్నారు కిషన్ రెడ్డి.

త్వరలోనే కేంద్రమంత్రిి అమిత్ షా శ్రీశైలానికి వస్తారని తెలిపారు. గోషాలో 1300 గోవులు ఉన్నా కొన్ని గోవులు బలహీనంగా ఉన్నాయన్నారు. గోవుల మేతకు దగ్గరలోని అడవిలోకి వెళ్లేందుకు అటవీ శాఖ అధికారులతో మాట్లాడతానని అన్నారు. హైదరాబాద్ – శ్రీశైలం రైల్వే మార్గం వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. శ్రీశైలంలో యాంఫీ థియేటర్ నిర్మాణం పై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి కిషన్ రెడ్డి. ఆలయానికి దూరంగా యాంఫీ థియేటర్ ఎందుకు నిర్మించారని అధికారులను ప్రశ్నించారు. యాంఫీ థియేటర్ చూడడానికి భక్తులు ఎలా వస్తారని అధికారులను నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version