అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు : కిషన్‌ రెడ్డి

-

ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయం సరైనదేనని కిషన్ రెడ్డి అన్నారు. హామీలపై కేటీఆర్ కు సమాధానం చెప్పే అవసరం తమకు లేదని చెప్పారు. రాష్ట్రంలో అనర్హులకు పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటనీ విమర్శించారు. 17సార్లు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వక నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందని, ఖమ్మంలో కూడా పార్టీ బలపడిందన్నారు. ప్రధాని మోడీ పర్యటన తర్వాత అమిత్ షా, నడ్డా పర్యటనలు ఉంటాయన్నారు.

Shri G. Kishan Reddy Union Minister for DoNER, Tourism and Culture today  interacted with Chief Ministers of four North Eastern States

కాగా, ఇటీవలే అంతా సర్దుకుందని భావిస్తున్న సమయంలో గవర్నర్.. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీలకు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను తిరస్కరించారు. ఈ వ్యవహారాన్ని బిఆర్ఎస్ మంత్రులు తప్పుబట్టారు. రాజకీయ నేపథ్యం ఉందని ఇద్దరు పేర్లను తిరస్కరించడం అత్యంత దుర్మార్గం అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎస్టీ, ఎంబీసీ సామాజిక వర్గాలను అగౌరవపరచినట్లేనని వ్యాఖ్యానించారు.గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌ను రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని బిఆర్ఎస్ మంత్రులు ఆరోపించారు. మంగళవారం(సెప్టెంబర్ 26) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news