త్వరలో అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌.. ఎస్బీఐ కార్డు ఉంటే బెనిఫిట్స్‌ డబుల్‌

-

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ప్రారంభంకాబోతుంది. ఫెస్టివల్‌ సీజన్‌ కాబట్టి.. ఈ కామర్స్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌ ఇలాంటి సేల్‌ స్టాట్‌ అవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ కూడా.. సెప్టెంబర్‌ 28 నుంచి స్టాట్‌ చేయబోతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతుంది. మీరు కూడా ఈ సంవత్సరంలో అతిపెద్ద సేల్ నుంచి షాపింగ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023ని ప్రకటించింది, ఇది అక్టోబర్ 10 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో దాదాపు అన్ని వస్తువులను డిస్కౌంట్‌లతో పొందవచ్చు. రోజువారీ గృహోపకరణాల నుంచి పెద్ద ఎలక్ట్రానిక్ ఉపకరణాల వరకు, ఫ్యాషన్, గృహాలంకరణ ఉత్పత్తులు, ఫర్నిచర్ అందుబాటులో ఉన్నాయి.

ఈ సేల్ ప్రైమ్ మెంబర్‌లకు దాదాపు 24 గంటల ముందుగానే అందుబాటులో ఉంటుంది. మీకు కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ లేకపోతే, మీరు ఇప్పుడు ప్రైమ్ మెంబర్‌షిప్ పొందవచ్చు. మీరు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో SBI కార్డ్‌తో షాపింగ్ చేస్తే, మీకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

సేల్‌లో షాపింగ్ చేసేటప్పుడు మీరు SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీరు 10% వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ కంటే.. ముందే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ స్టాట్‌ కావడంతో.. కష్టమర్లు అంతా వీటిపైనే ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది. పైగా ఈ బిగ్‌బిలియన్‌ డేస్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఎక్కువ డిస్కౌంట్‌ ప్రకటించారు.

ఫ్లిప్‌కార్ట్ త్వరలో ప్రారంభించనున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ 80 శాతం డిస్కౌంట్ అందించే జాబితాలో మోటో జి54 5జి, గెలాక్సీ ఎఫ్ 34 5జి, రియలా్ మి సి51, రియల్ మి 11 5జి, రియల్ మి 11 ఎక్స్ 5జి, ఇన్ఫినిక్స్ జీరో 30 జి, మోటో జి84 5జి, వివో వి29 ఇ, పోకో ఎం6 ప్రో 5జి మోడళ్లు ఉన్నాయట. అక్టోబర్ 1వ తేదీన ఐఫోన్, అక్టోబర్ 3న శాంసంగ్, అక్టోబర్ 5న పిక్సెల్, అక్టోబర్ 7న షియోమీ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు లిస్ట్ కానున్నాయి. ఇంకెందుకు లేట్‌ ఈ పండుగ సీజన్‌ను ఈ ఆఫర్లతో డుబుల్‌ ఎంజాయ్‌ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news