90 వేలు గూగుల్ పే చేసి సహాయం చేసిన తెలంగాణ మంత్రి …!

-

లాక్ డౌన్ వలన ఇప్పుడు వలస కార్మికులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు అనేది వాస్తవం. చాలా మందికి తిండికి లేక ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. ఎవరికి వారుగా తమ సొంత ఊర్లకు వెళ్ళడానికి ఇప్పుడు సిద్దమవుతున్నారు. అయితే రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీనితో వలస కార్మికులు చాలా వరకు నరక యాతన అనుభవించే పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నా పరిస్థితి మెరుగు పడటం లేదు.

తెలంగాణకు చెందిన వేలాది మంది కార్మికులు కరోనా ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో చిక్కుకున్నారు. వారికి తినడానికి తిండి లేదు. దీనితో తెలంగాణా మంత్రి పెద్ద మనసు చాటుకున్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుండి ముంబైకి ఉపాధి కోసం వెళ్ళగా.. లాక్‌డౌన్‌తో ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వీడియో కాల్ చేసారు.

గూగుల్ పే ద్వారా తక్షణం రూ.90వేలు పంపించారు. దీనిపై పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వారే నిజమైన నాయకులు అంటూ అభినందిస్తున్నారు. ఇప్పుడు కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉంది. అక్కడ భారీగా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ వెయ్యికి చేరువలో కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news