దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఇల్లు కదలడానికి లేదు. ఒకవేళ బయటకి వస్తె పోలీసుల ప్రశ్నలు, ఏం పనిమీద బయటకి వచ్చావ్, అని కారణం చెప్పాలి, అలా అని ఏదో ఒక కారణం చెప్పకూడదు, ఎందుకంటే నిత్యావసర సరుకులు కొనడానికి తప్ప బయటకు రాకూడదు అని ప్రభుత్వాల ఆదేశం. అది కూడా గవర్నమెంట్ వారు నిర్దేశించిన టైమ్ లో మాత్రమే బయటకు వచ్చి అవసరమైన నిత్యావసరాలు కొనుక్కుని ఇంటికి వెళ్లిపోవాలి.
ఇలాంటి సమయంలో పార్టీ చేసుకోవాలి అనిపించింది ఒక వ్యక్తికి. అతని పేరు బాజీ చౌదరి. ఇతను ఢిల్లీ లోని బులంద్‌షహర్‌కి చెందిన వాడు. మందు బాటిళ్లను పాల కాన్ లో పెట్టుకుని బండికి కట్టుకుని పోలీసులకు అనుమానం రాకుండా బయలుదేరాడు. రాష్ట్రపతి భవన్ ఏరియా కి వచ్చేసరికి టెన్షన్ స్టార్ట్ అయింది బాజీ కి, కంగారు మొదలైంది. అక్కడ ఉన్న పోలీసులకు అతని కంగారు చూసి డవుట్ వచ్చింది.
వెంటనే బండి ని ఫాల్లో చేసి, బండి ఆపి ఏం ఉంది కాన్ లో అని అడిగి మూత తీసి చూసిన పోలీసులకు మందు బాటిళ్లు కనిపించాయి. లిక్కర్ షాపులు అన్ని బంద్ అయినప్పటికీ లిక్కర్ ఎలా సరఫరా అవుతుందో చూసి షాక్ తిన్నారు పోలీసులు. బాజీ నీ ప్రశ్నించగా కజిన్ పుట్టిన రోజు పార్టీ ఉందనీ, దాని కోసమే మందు బాటిళ్లు తీసుకెళ్తున్నానని బాజీ వారికి చెప్పాడు. ఇది లాక్‌డౌన్ రూల్స్‌కి విరుద్ధం అన్న విషయాన్ని చెప్పి, నిత్యవసర సరుకులు మాత్రమే తీసుకెళ్లాలని చెప్పి మందు బాటిళ్లనూ సీజ్ చేసి అతన్ని అరెస్టు చేశారు.