మీడియాపై కేటీఆర్ రుస‌రుస‌

-

తాను అన‌ని మాట‌ల‌ను కొన్ని మీడియా సంస్థ‌లు త‌న‌కు ఆపాదించ‌డం స‌రైందికాద‌ని ఐటీ, పుర‌పాల క‌శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. న‌వంబ‌ర్ 11వ త‌ర్వాత గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లు ఉంటాయ‌ని తాను వ్యాఖ్యానించిన‌ట్లు కొన్ని మీడియా సంస్థ‌లు రిపోర్టు చేయ‌డంలో నిజం లేద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. జీహెచ్ఎంసీ యాక్ట్ ప్ర‌కారం న‌వంబ‌ర్ రెండో వారం త‌ర్వాత ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చ‌ని, అందుకు పార్టీ నాయ‌కులు సిద్ధంగా ఉండాల‌ని మాత్ర‌మే తాను అన్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల షెడ్యూల్‌, నిర్వ‌హ‌ణ పూర్తిగా ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌రిధిలోని అంశ‌మ‌ని ఆయ‌న తెలిపారు.

నిబంధనల ప్రకారం నవంబర్‌ రెండో వారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రావొచ్చు. పోరుకు ఇప్పటి నుంచే సన్నద్ధమవ్వాలి. సర్వేలన్నీ తెలంగాణ రాష్ట్ర సమితికే అనుకూలంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ 91 సీట్లు కచ్చితంగా వస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు మారాలి. జనంతో మమేకమై వారితో కలిసి పనిచేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది’ అని కేటీఆ ర్ పేర్కొన్న విష‌యం తెలిసిందే. మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో సమావేశం సంద‌ర్భంగా ఆయ‌న గ్రేట‌ర్ ఎన్నిల‌క‌ల‌పై పై విధంగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news