సైబర్ నేరగాళ్ల వలలో మంత్రి నారాయణ అల్లుడు..!

-

సైబర్ నేరగాళ్ల వలలో మంత్రి నారాయణ అల్లుడు ఇరుక్కున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ని బురిడీ కొట్టించిన కేటుగాళ్లు అరెస్ట్ అయ్యారు. పునీత్ పేరుతో కంపెనీ అకౌంటెంట్ కి మెసేజ్ పంపారు యూపీకి చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లు. అర్జెంట్ గా రూ.1.96 కోట్లు కావాలని మెసేజ్ రావడంతో నగదు ట్రాన్స్ ఫర్ చేశారు అకౌంటెంట్.

Minister Narayana's son-in-law in the net of cyber criminals
Minister Narayana’s son-in-law in the net of cyber criminals

సైబర్ క్రైమ్ జరిగిందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారాయణ అల్లుడు పునీత్. ఈ కేసులో అరవింద్ కుమార్ తో పాటు సంజీవ్ అనే నిందితుడిని అరెస్టు చేశారు పోలీసులు. ఇక పరారీలో మరొక నిందితుడు ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news