బిజెపి తొండి మాటలు బంద్ చేయాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

కేంద్ర ఆస్పష్ట విధానంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం తన ధర్మాన్ని నిర్వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తుదని ఆరోపించారు. షరతులు పెట్టి పోయిన యాసంగి ధాన్యం కొన్నారు అంటూ నిరంజన్ రెడ్డి అన్నారు. బీజేపీ తొండి మాటలు బంద్ చేయాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

S_Niranjan_Reddy_comment’s

వరి ధాన్యం కొంటారో లేదో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని బద్నాం చేయడం మంచి పద్ధతి కాదని…కరోనా టైంలో అన్నీ బంద్ అయినా రైతులు పంట పండించడం బంద్ కాలేదు అని అన్నారు. మనోవేదనతో సీఎం ధర్నాకు కూర్చున్నారు అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం మనసు మార్చుకోక పోతే పతనం తప్పదు అని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా నేడు కేంద్రం తెలంగాణ లో పండించిన వడ్లను కొనాలని రాష్ట్రప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగింది.