దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేయాలి.. సీఎం కేసీఆర్ కు సీతక్క సవాల్.

-

వరి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలకు, పాలక పక్షాలకు మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. నిన్నటి దాకా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్లా ఉన్న పొలిటికల్ వాతావరణం ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా మారింది. వరిధాన్యం కొనుగోలు విషయంపై కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై ఫైరయ్యారు.

తెలంగాణ రైతాంగం నష్టపోతుందని అనుకుంటే వడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్నవన్నీ దొంగదీక్షలే అని సీతక్క విమర్శించారు. వడ్ల కొనుగోలుకు పరిష్కారం చూపంకుండా దీక్షలకు దిగడం సిగ్గు చేటని ఆమె విమర్శించారు. కేంద్రం వ్యవసాయ చట్టలు తీసుకువచ్చినప్పుడు మీరు ఏం చేశారని .. అమలు చేస్తున్నప్పుడు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేయాలని సీతక్క, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. ఢిల్లీలో దోస్తీ… గల్లీలో కుస్తీలా కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీల పరిస్థితి ఉందని అన్నారు. ఏడేళ్ల నుంచి బీజేపీతో ఏడు అడుగులు నడిచారని సీతక్క విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news