తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం ఎస్ఎస్ఈ(పదో తరగతి) పరీక్షల్లో ఇప్పుడు అమలవుతున్న గ్రేడింగ్ విధానాన్ని మారుస్తూ ప్రకటన వెలువడింది. దీంతో స్కూల్ యాజమాన్యాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. ఉదయం గ్రేడింగ్ సిస్టమ్‌ను ఎత్తేస్తున్నట్లు ప్రకటన వెలువడగా.. సాయంత్రంలోపు మరో ప్రకటన వెలువడింది.
మరల గ్రేడింగ్ విధానాన్ని ఎత్తివేయడం లేదని, పాత పద్దతిలోనే టెన్త్ గ్రేడింగ్ విధానం కొనసాగుతుందని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. అకాడమిక్ ఇయర్ మధ్యలో గ్రేడింగ్ విధానం తీసుకుని వస్తే విద్యార్థులు గందరగోళానికి గురవుతారని, అందుకే 2025-26 సంవత్సరానికి గ్రేడింగ్ విధానంలో మార్పులు తీసుకొస్తామని ప్రకటన వెలువడింది. దీంతో స్కూల్ మేనేజ్మెంట్స్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి.
తెలంగాణలో విద్యా శాఖ మంత్రి లేక గందరగోళం
నిన్న టెన్త్ పరీక్షల్లో గ్రేడింగ్ విధానం ఎత్తేసినట్లు ప్రకటన
నేడు యూ టర్న్ తీసుకొని పాత పద్దతిలోనే టెన్త్ గ్రేడింగ్ విధానం అని ప్రకటన pic.twitter.com/ZwCdVqJt73
— Telugu Scribe (@TeluguScribe) November 29, 2024