కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండల పరిధిలో పెద్దపులి సంచరిస్తోంది. దీంతో ఆ చుట్టు పక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే యువతి పత్తి ఏరేందుకు చేనుకు వెళ్లింది. ఆమెపై పులి దాడి చేయగా మరణించింది.
దీంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు మొత్తం 15 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు. ఈద్గాం, నజ్రాల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వారు పొలం పనులకు వెళ్లొద్దని, పశువులను బయటకు వదలొద్దని, పాకలోనే కట్టేయాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.