టిడ్కో ఇళ్ల నిర్మాణాలపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు

-

టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ… రాష్ట్రంలో 13 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉంది అని తెలిపారు.గత ప్రభుత్వం 26 లక్షల ఇళ్లు నిర్మించాల్సి ఉందని, కానీ 6 లక్షలు మాత్రమే కట్టిందని వెల్లడించారు.

ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన నిధులను కూడా వైఎస్ జగన్ ప్రభుత్వంలో దారి మళ్లించారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . ఇళ్ల లబ్ధిదారుల పేరిట రుణాలు కూడా తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో మొత్తం నిధులు కేంద్రానివేనని తెలిపారు. రాష్ట్ర వాటా కింద అప్పటి జగన్ ప్రభుత్వం నిధులేమీ ఇవ్వలేదని అన్నారు. నివాసానికి ఆమోదయోగ్యంగా లేని చోట్ల జగనన్న లే ఔట్లు వేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిలిపివేసిన అన్ని ఇళ్లను కేంద్రం సాయంతో నిర్మించాలని తాము కసరత్తులు చేస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news