ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశం కానున్నది మంత్రుల కమిటీ. పీఆర్‌సీ అంశాలు ఉద్యోగుల నిరసనలపై చర్చించనున్్నది. క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి పేర్నినాని. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఉద్యోగ సంఘాలతో జరిపే చర్చలు ఉద్యోగులకు సంతృప్తిని ఇచ్చే విధంగా ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ఉద్యమాన్ని విమరించుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు పేర్ని నాని.
పలు అంశాలపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాం. ఆర్థిక పరమైన విషయాలపై ప్రభుత్వంలో అంతర్గతంగా చర్చించుకుని మధ్యాహ్నం ఉద్యోగులతో భేటి అవుతాం. పీఆర్‌సీ పంచాయతీ ఇంత వరకు రావడం వెనుక సీఎస్ నో, అధికారులనో తప్పు పట్టలేమన్నారు. ప్రభుత్వం సమిష్టి బాధ్యత. చెడు అయినా మంచి అయినా ప్రభుత్వానిదే. షరతులతో చర్చలు జరగవు. సమస్య పరిష్కారం కాదు అని పేర్కొన్నారు మంత్రి పేర్ని నాని. ఇదిలా ఉండగా.. తిరుపతిలో చంద్రగిరి ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్, యాప్‌డౌన్ చేస్తున్నారు. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని సహాయ నిరాకరణ ఉద్యోగులు. తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ఉప ఖజానా, ఇరిగేషన్ కార్యాలయాల్లో నిలిచిపోయాయి. ఎలాంటి పైల్స్ ముట్టుకోకుండా నిరసన తెలుపుతున్నారు ఉద్యోగులు. అసలు కార్యాలయానికే రాలేదన్నారు కొందరూ ఉద్యోగులు.