వైఎస్ఆర్ నీటి దొంగ అయితే… జగన్ గజదొంగ : తెలంగాణ మంత్రి

తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వై ఎస్ ఆర్ నీటి దొంగ అయితే.. సీఎం జగన్ గజ దొంగ అయ్యిండని ఫైర్‌ అయ్యారు. ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఆపక పోతే ప్రజా యుద్ధమేనని…లంకలో ఉండేవాళ్లంతా రాక్షసులేనని మండిపడ్డారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుమతులు లేకున్నా…అక్రమ ప్రాజెక్ట్ లు చేపడుతున్నారని.. ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవని విమర్శలు చేశారు.

కృష్ణ నీటిని తరలించుకు పోతుంటే అప్పటి ఈ జిల్లా మంత్రి హారతులు పట్టిందని… పోతిరెడ్డిపాడు నీటిని తరలించి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి దొంగిలించుకు పోయారని ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంతో  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గజ దొంగ అయ్యారని నిప్పులు చెరిగారు. ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని కోరబోతున్నారని.. ఏపీ ప్రాజెక్ట్ లు అపక పోతే మరో ప్రజా ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.