రాజా ‘దాడి’.. లాజిక్ లేదే.!

-

రాజకీయాల్లో లాజిక్‌లతో పనిలేకుండా మాట్లాడటం నాయకులకు అలవాటు అయిపోయింది. ఏది పడితే అది మాట్లాడిస్తే..ప్రజలు నమ్మేస్తారనే భ్రమల్లో నేతలు ఉంటారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు. ప్రజల మద్ధతుతో అధికారంలోకి వచ్చిన వారు..తాము ఏం చెప్పినా? ఏం చేసినా ప్రజలు నమ్మేస్తారనే అనుకుంటారు. తాము చెప్పిందే వేదం అన్నట్లు భావిస్తారు. అయితే లాజికల్‌గా మాట్లాడితే, నిజాలు చెబితే ప్రజలు నమ్ముతారు. ఒకవేళ అబద్దాన్ని కూడా నమ్మిన అది ఎంతోకాలం తెలియకుండా ఉండదు.

కాబట్టి నాయకులు అనే వారు ప్రజలు నమ్మేలా మాట్లాడాలి. కానీ అధికారంలో వైసీపీ నేతలు తమకు ప్రజలే అధికారం ఇచ్చారు కాబట్టి.. తాము ఏం చెప్పిన నమ్మేస్తారనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకు అదే తరహాలో ముందుకెళుతున్నారు. తాజాగా మంత్రి దాడిశెట్టి రాజా కూడా అదే తరహాలో లాజిక్ లేకుండా మాట్లాడారు. ఇప్పటికే మూడు రాజధానులు చేయాలని వైసీపీ పట్టు పట్టుకుని కూర్చుంది. ఇదే క్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలు..విశాఖ రాజధాని కోసం ఉద్యమం మొదలుపెట్టారు.

ఈ అంశంపై రాజకీయంగా రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలో మూడు రాజధానులకు మద్ధతుగా ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీకి సవాల్ చేశారు. దీనికి స్పందిస్తూ..అమరావతికి మద్ధతుగా టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, ఒక్కరు గెలిచిన మూడు రాజధానులకు మద్ధతు ఇవ్వనని చెప్పారు. అసలు ఇందులో ఏ మాత్రం లాజిక్ లేకుండా ఉంది.

ఎందుకంటే అమరావతి రాజధానిగా ఉన్న రాష్ట్రాన్ని మూడు రాజధానులు చేయాలని చూసింది వైసీపీనే. పోనీ 2019 ఎన్నికల ముందు మూడు రాజధానులతో ఎన్నికలకు వస్తే అర్ధం ఉండేది. అప్పుడు అమరావతి మాత్రమే రాజధాని చెప్పి.. అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని చెప్పింది. అంటే ఇప్పుడు మూడు రాజధానుల రిఫరెండంగా ఎన్నికలకు వెళ్ళాల్సింది వైసీపీనే. ముందే రాజీనామా చేయాల్సింది కూడా వైసీపీనే.

ఈ లాజిక్ పక్కన పెడితే.. ఈ నెల 15న విశాఖ గర్జనని డైవర్ట్ చేయడానికి పవన్ అదే రోజున జనవాణి పెట్టుకున్నారని విమర్శించారు. ఇది కూడా లాజిక్ లేకుండా ఉంది. అసలు మూడేళ్ళ క్రితమే మూడు రాజధానులు అని చెప్పి.. ఇప్పుడు విశాఖ కోసం ఉద్యమం అని మొదలుపెట్టారు. పైగా అధికారంలో ఉన్న వైసీపీకి ఏదైనా చేసే బలం ఉంటుంది. అయినా సరే ఉత్తరాంధ్రలో రాజకీయంగా ప్లస్ అవ్వడం కోసం విశాఖ వేదికగా చేసుకుందని అర్ధమవుతుంది. ఇవి పక్కన పెడితే.. రాష్ట్రంలో రోడ్ల పరిస్తితి ఎలా ఉందో చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు రోడ్లు బాగుచేయాలని జగన్ చెప్పినట్లు స్టేట్‌మెంట్లు వస్తాయి గాని, రోడ్లు బాగుపడవు.

ఇక దీనిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే తాజాగా మంత్రి రాజా ఇచ్చిన సమాధానం ఏంటంటే..బాగున్న రోడ్లకు ప్రతిపక్ష నేతలు గుంతలు పెట్టి డ్రామాలు ఆడుతున్నారని అంటున్నారు. మరి ఈ స్టేట్‌మెంట్‌ని ప్రజలు నమ్ముతారో లేదో..ఆ ప్రజలకే వదిలేయడమే. ఏ మాత్రం లాజిక్ లేకుండా రాజా.. ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడం వల్ల పావలా ప్రయోజనం ఉండదని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version