చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ద్రోహి అని పర్యాటక శాఖ మంత్రి ఆర్.కే.రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చిత్తూరు విజయ డైరీని మూయించిన చంద్రబాబు.. జిల్లాకు, రాష్ట్రానికి చేసింది శూన్యమని పేర్కొన్నారు. పుంగనూరు తరహా ఘటనను భీమవరంలో రిపీట్ చేశారని ఫైర్ అయ్యారు రోజా. అమరావతిని అవినీతి రాజధాని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ప్రశ్నిస్తా అంటూ చెప్పే వపన్ కళ్యాణ్ ఎక్కడ దాక్కున్నాడని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. బీజేపీ అంటే ఏపీలో బాబు జనతా పార్టీగా మారిందని.. పురంధేశ్వరి ఎందుకు మరిది గురించి మాట్లాడటం లేదని ప్రశ్నించారు. సింగపూర్ లో దోచుకున్న మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లారన్న రోజా.. త్వరలోనే అమరావతి అవినీతి కేసులో చంద్రబాబు, లోకేష్ జైలుకు వెళ్తారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇండియా ను భారత్ అనే పేరుగా మార్చడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి రోజా స్పష్టం చేశారు.