జగన్ ఆస్తుల కేసులో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్ నుంచి తొలగించాలని ఈ పిటిషన్ లో కోరింది సబితా ఇంద్రా రెడ్డి. అయితే.. దీనిపై స్పందించిన సీబీఐ… సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సమయం కోరింది.
కౌంటరు దాఖలు కోసం విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. అటు విశ్రాంత ఐఏఎస్ అధికారి శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ కేసు నుంచి శామ్యూల్ ను తొలగించవద్దని కోరింది సీబీఐ. పయనీర్ హాలిడే రిసార్ట్స్ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరుకు సమయం కోరిన సీబీఐ.. పీఆర్ ఎనర్జీ డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సమయం కోరింది. కాగా.. పెన్నా సిమెంట్స్ ఛార్జ్ షీట్ పై విచారణ ఈ నెల 13 కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు.