పవన్ కల్యాన్(pawan kalyan) కు త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై ఇటు పవన్ గానీ అటు కేంద్ర బీజేపీ పెద్దలు గానీ పెదవి విప్పలేదు. కానీ ఇప్పుడు పవన్ తరఫున ఆ పార్టీలో కీకలంగా పనిచేస్తున్న నాదెండ్ల మనోహర్ మాత్రం క్లారిటీ ఇచ్చారు. కాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాస్త ఓవర్‌గా అనిపిస్తున్నాయి.
పవన్ కల్యాణ్ లాంటి జనాదరణ కలిగినన వ్యక్తి మొదటి నుంచి సమాజంలో కీలకమైన మార్పు తీసుకొచ్చేందుకు పోరాడుతున్నారని, అలాంటి వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి అనేది చాలా చిన్నదని, అంతే కాదు అది చాలా తాత్కాలికమైనదని అన్నారు.
అందుకే ఆ పదవి తాము తీసుకుంటామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. అయితే జనసేన కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ మీద ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కల్యాణ్‌ను ఏకంగా కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే మంచిదే కదా. పవన్‌కు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. కానీ ఇలా మాట్లాడటంతో జనసైనికులు కాస్త బాధ పడుతున్నారు. చూడాలి మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.