తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై మంత్రి సంధ్యారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత ఐదేళ్లలో లడ్డూల్లో అపవిత్రం జరిగిందా? లేదా అనేది భక్తులే చెబుతారని, కోర్టులు అవసరం లేదని ఆమె వెల్లడించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఐదేళ్లకు ముందు ఏ ప్రభుత్వంలోనూ లడ్డూలో కల్తీ జరగలేదన్నారు.
లడ్డూను చూస్తే వెంకటేశ్వరస్వామిని చూసినంత ఆనందం కలుగుతుందని వివరించారు. అలాంటి లడ్డూ తయారీలో ప్రభుత్వం పూర్తి బాధ్యతలు తీసుకోవాలని వెల్లడించారు. గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు లడ్డూ నాణ్యత బాగుందని మంత్రి సంధ్యారాణి కితాబిచ్చారు. గత ప్రభుత్వం టీటీడీ విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని ఆమె ఘాటు విమర్శలు చేశారు.