కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వం అని.. కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మొట్టమొదటిసారిగా అత్యధిక బొగ్గు ఉత్పత్తితోపాటు అత్యధిక లాభాలను కూడా గడించడం సంతోషం హర్షించదగిన విషయమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనస్సుతో కష్టపడిన కార్మికులకు బోనస్ ప్రకటించడం, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా తొలిసారి బోనస్ ప్రకటించడం అందించడం గొప్ప విషయం అన్నారు. సింగరేణి గనులు ఉన్న హాస్పిటల్స్ లో కనీస వస్తుతులు లేవని, ఇది బాధాకరమని, సింగరేణి ఉద్యోగుల కోసమేకాకుండా మైన్స్ ఉన్న ప్రాంతంలో టాప్ వైద్యం అందేలా వైద్య సేవలను అందించేలా కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. హైదరాబాద్ లోని టాప్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూషన్స్ స్థాయిలో  స్థాయిలో సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా అందించాల్సి ఉందని అన్నారు. అలాగే కార్మికులకు కచ్చితమైన ఇళ్లు అందించే దిశగా మంత్రి మండలిలో మాట్లాడి అతి త్వరలో కార్మికులకు తీపికబురు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news