ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ పై మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లాంటి అసమర్థత వ్యక్తి సీఎం ఎలా అయ్యాడోనని ప్రశ్నించారు. గతంలో ఏపీలో 17 వైద్య కళాశాలల నిర్మాణం ప్రారంభించినట్టు చెప్పారు. కానీ ఏ ఒక్కటీ కూడా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తి కాకుండానే రాజమండ్రిలో కళాశాలను ప్రారంభించినట్టు గుర్తు చేశారు.
ప్రస్తుతం రెండో సంవత్సరం విద్యార్తులకు తరగతి గదులు లేవని.. తాత్కాలిక భవనాల్లో నడపాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పులివెందుల వైద్య కళాశాలలో 48 శాతం బోధన సిబ్బంది లేరన్నారు. విద్యార్థులను ఎక్కడ చదివించాలి జగన్ సారూ.. షెడ్ల కిందా..? గదులు ఏర్పాటు చేసినా..