మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం… మేడారం నుంచి హుటాహుటిన సొంతూరికి

0
78

తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సత్యవతి రాథోడ్ తండ్రి లింగ్యా నాయక్ మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న లింగ్యా నాయక్ మరణించారు. ఆయన సొంతూరు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండాలో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే మేడారం జాతర పనుల్లో ఉన్నమంత్రి సత్యవతి రాథోడ్ సొంతూరుకు బయలుదేరారు.

ప్రస్తుతం మేడారం జాతర పనుల్లో మంత్రి సత్యవతి రాథోడ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతర మొదలకు రెండు నెలల ముందు నుంచే మేడారం పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. గత వారం నుంచి మేడారంలోనే ఉంటూ… జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో తండ్రి మరణ వార్త విన్న ఆమె హుటాహుటిన సొంతూరుకు వెళ్లింది. జాతరకు ముందు రోజు ఇలా జరగడంతో మంత్రి ఇంట తీవ్ర విషాదం అలుముకుంది.