ఏప్రిల్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు..!

-

కరోనా కారణంగా ప్రపంచంలో అన్ని వ్యవస్థలపై ప్రభావం పడింది. రెండేళ్లుగా విమానయానం రంగం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు తీవ్ర విఘాతం ఎదురైంది. ఇదిలా ఉంటే .. ఏప్రిల్ నుంచి ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుమఖం పట్టడంతో ఏప్రిల్ నుంచి విదేశీలకు రాకపోకులు ప్రారంభించే అవకాశం ఉంది. దీనిపై పౌర విమానయాన శాఖ ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతన్నట్లు సమాచారం.

గతేడాది డిసెంబర్ నుంచే అంతర్జాతీయ విమాన సర్వీాసులను ప్రారంభించాలని కేంద్ర విమానయాన శాఖ భావించినప్పటికీ… ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా మరోసారి బ్రేక్ పడింది. అప్పటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులుపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 28 వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొన్ని దేశాలకు మాత్రమే.. పూర్తిగా కరోనా ప్రోటోకాల్ ప్రకారం విమాన సర్వీసులు నడుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news