మోహన్ బాబు కోపం ఆయనకే నష్టం : తలసాని

ఇవాళ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు.  అయితే ఈ కార్యక్రమానికి.. మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి తలసాని శ్రీనివాస్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

minister talasani srinivas yadav fires on bjp

మా అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో సంతోష దాయకమైన సందర్భం అని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరిగాయని.. మా కు ఎన్నికయిన సభ్యులకు తన అభినందనలు అని పేర్కొన్నారు తలసాని.

మా అసోషియేషన్ అంటే చిన్న అసోసియేషన్ కాదని.. మా అంటే పెద్ద వ్యవస్థ అని కొనియాడారు. మోహన్ బాబు… హీరో మంచు విష్ణు కు చదువు, సంస్కరం , క్రమశిక్షణ ఇచ్చారన్నారు. మోహన్ బాబు నుంచి తాను చాలా నేర్చుకున్నానని.. మోహన్ బాబు కోపం ఆయనకే నష్టం చేసింది …ఇతరులకు కాదన్నారు. ఇండస్ట్రీ లో మోహన్ బాబు కు కోపం ,ఆవేశం ఎక్కువని అందరూ అనుకుంటారని.. తప్పును …తప్పు అనే ధైర్యం మోహన్ బాబు కు ఉందని పేర్కొన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్.