టాలీవుడ్ కు తెలంగాణ సర్కార్ శుభవార్త.. !

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీపి కబురు చెప్పారు. త్వర లోనే మంచు విష్ణు టీం ను సీఎం కేసీఆర్ దగ్గరికి పిలుస్తామని స్పష్టం చేశారు. చిత్రపురి ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం చేసామని.. అందరూ సమిష్టిగా ” మా ” ను ముందుకు తీసుకెళ్లండి …మీ వెంట మేము ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్.

అర్హులైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తామని స్పష్టం చేశారు. మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి.. మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. మా ఎన్నికకు 10 రోజుల ముందే ఫోన్ చేసి మంచు విష్ణు గెలుస్తారని చెప్పానని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ తలుచుకుంటే 900 వందలు కాదు…9 వేల మందిని నడిపించుకోవచ్చన్నారు. సినిమాను థియేటర్లలలో చూడాలని ప్రేక్షకులకు పిలుపునిచ్చారు తలసాని. మా అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో సంతోష దాయకమైన సందర్భం అని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో మా ఎన్నికలు జరిగాయని.. మా కు ఎన్నికయిన సభ్యులకు తన అభినందనలు అని పేర్కొన్నారు తలసాని.