పంచ్ అదిరిందంట: సంక్షేమం వేరు.. “సన్”క్షేమం వేరు!

-

వైకాపా నేతలు చంద్రబాబును విమర్శించే విషయంలో తమ తమ క్రియేటివిటీలకు పదునుపెడుతున్నారు. కొత్త కొత్త విమర్శలు సృష్టించి మరీ బాబుని ఇరకాటంలో పెడుతున్నారు. వీరి దూకుడుకు బాబు ఆన్ లైన్ జూం దూకుడు సరిపోకపోవడంతో… వార్ వన్ సైడ్ అయిపోతుందనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా బలంగా వినిపిస్తున్నాయి!

వివరాళ్లోకి వెళ్తే… బీసీలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, సంక్షేమ పథకాలు అందడం లేదని.. సంక్షేమం అంటే తమ ప్రభుత్వంలో జరిగినది అని చెప్పుకొస్తున్నారు టీడీపీ నేతలు. జగన్ ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా వాటిలో తమవంతు ప్రయత్నంగా రాజకీయ విమర్శలు చేయడానికి ట్విట్టర్ ను అత్యంత బలంగా వాడుకుంటున్నారు! ఈ క్రమంలో… బీసీలకు సంక్షేమం విషయంలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసురుతున్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి వేణుగోపాలకృష్ణ!

తాజాగా మైకందుకున్న బీసీ సంక్షేమ మంత్రి వేణు… “రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి మీ పాలనలో ఏమి చేశారో? ఇప్పుడు మా పాలనలో ఏమి చేశామో చర్చకు సిద్ధామా?” అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు తనపాలనలో సంక్షేమం అంటే “సన్”క్షేమం అని భావించారని.. దాని ఫలితమే గడిచిన ఎన్నికల్లో సుస్పష్టంగా కనిపించిందని స్పష్టం చేసారు వేణుగోపాల్! “చేయూత”తో మహిళలకు సీఎం జగన్ ఆర్థిక భరోసానిస్తే… దానిపై కూడా పిచ్చి పిచ్చి విమర్శలు చేయడం సరికాదని వేణు హితవు పలికారు!! దీంతో… “విమర్శలందు చంద్రబాబుపై వైకాపా నేతల విమర్శలు వేరయా” అంటున్నారు నెటిజన్లు!

Read more RELATED
Recommended to you

Exit mobile version