చాందిని కి ఓ 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు కానీ భర్త చనిపోయాడు. దాంతో రామ్ దేవ్ కు కూడా భార్య చనిపోవడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. రామ్ దేవ్ కు కూడా 16 ఏళ్ల కూతురు ఉంది. అందరూ కలిసి సంతోషంగానే ఉన్నారు. అలా కన్నో నెలలు గడిచాయి ఇంకొన్ని నెలలు గడుస్తే రామ్ దేవ్ కూతురు మేజర్ అవుతుందని ఆమె గ్రహించింది. మేజర్ అవుతే రామ్ దేవ్ ఆస్తి అంతా తనకే వెళ్లిపోతుందని సవితి కూతురును తన కొడుకుతో అత్యాచారం చేయించింది. తన జీవితాన్ని నాశనం చేసింది. ఈ విషయం ఎవరితోనైనా చెబితే తండ్రిని చంపేస్తానని చెప్పింది. దాంతో బాలిక ఆత్మహత్య ప్రయత్నం చేసింది.
వివారాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలో చాందిని(పేరు మార్చాము) నివాసం ఉంటుంది తన భర్త చనిపోయాడు అప్పటికే ఆమెకు 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. భర్త చనిపోవడంతో సంబంధాలు వెతుకగా రామ్ దేవ్ గురించి తెలిసింది. రామ్ దేవ్ కు కూడా భార్య చనిపోవడంతో ఇద్దరు రెండవ పెళ్లి చేసుకున్నారు, కాగా రామ్ దేవ్ కు అప్పటికే ఓ 16 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలం కూతురిని మంచిగానే చూసుకున్నా కొంత కాలం తరువాత తన నిజమైన రంగు చూపెట్టింది. ఆ బాలికకు 18 దాటితే ఆస్తులు తన సొంతం అవుతాయని తెలుసుకొని ఆ బాలిక పై కోపం పెంచుకుంది. పిక్ నిక్ అని చెప్పి తీసుకెళ్లి తన కొడుకు తో అత్యాచారం చేయించింది. విషయం బయట పెడితే తన తండ్రికి విషం పెట్టి చంపుతానని బెదిరించింది. దాంతో ఆ బాలిక ఆ విషయాన్ని తనలోనే దాచుకుంది. అలా కొన్ని రోజులు గడువగానే ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసుకొని మరోసారి ఆ బాలిక పై అత్యాచారాయత్నం చేయించింది. బాలిక తప్పించుకొని పారిపోయి దగ్గరలోని చెరువులో దుకేసింది. అది గమనించిన స్థానికులు ఆమెను రక్షించి పోలీసులకి అప్పగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నేరస్తుల పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.