ఆడవారి కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారి మీద దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రేమ పేరిట కొందరు వంచిస్తుంటే, మరి కొందరు ఏమో లైంగిక దాడులకి పాల్పడుతున్నారు. తెలంగాణాలోని ధర్మపురిలో దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలిక ప్రేమ పేరుతో మోసపోయిన గర్భం దాల్చింది. అయితే రెండు రోజుల క్రితం ఆమె ఓ శిశువుకు జన్మనిచ్చింది.
అయితే నెలలు నిండక ముందే బాలిక ప్రసవించడంతో బాలిక తల్లి సొంత వైద్యం చేసింది ఈ క్రమంలో అది వికటించి శిశువు సహా బాలిక మృతి చెందింది. దీంతో ఆమె తల్లి గుట్టు చప్పుడు కాకుండా స్మశాన వాటికలో పూడ్చి పెట్టిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎట్టకేలకు స్పందించిన రెవెన్యూ, పోలీసు అధికారులు, పూడ్చిపెట్టిన శవాలను బయటకు తీసి పోస్ట్ మార్టంకు పంపారు. బాలిక గర్భానికి కారణం అయిన ప్రేమికుడుని కఠినంగా శిక్షించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.