టీమిండియా పార్టీలో విరాట్ మిస్.. ఫ్యాన్స్ ఆగ్ర‌హం

టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి బీసీసీఐ మ‌ధ్యలో గ‌త కొద్ది రోజుల నుంచి వివాదం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వివాదం మ‌రో సారి తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల సౌత్ ఆఫ్రిక తో టెస్ట్ సిరీస్ ఆడ‌టానికి కెప్టెన్ కోహ్లి నేతృత్వంలో టీమిండియా ద‌క్షిణాఫ్రికా వెళ్లింది. అయితే బుధ‌వారం టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ తో పాటు సిబ్బంది అలాగే టీమిండియా ఆట‌గాళ్లు మ‌యాంక్ అగ‌ర్వాల్, వైస్ కెప్ట‌న్ కె ఎల్ రాహుల్, చ‌తేశ్వ‌ర పుజారాతో పాటు ప‌లువురు పార్టీ చేసుకున్నారు.

అయితే ఆ పార్టీకి సంబంధించిన ఫోటో ల‌ను టీమిండియా బ్యాటర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. అయితే అందులో టెస్ట్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేడు. దీంతో అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌తి సారి కోహ్లి ఇలా ఎందుకు చేస్తున్నారంటు సోష‌ల్ మీడియాలో టీమిండియా పై, బీసీసీఐ పై ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ లేకుండానే పార్టీ చేసుకుంటారా అంటు సోష‌ల్ మీడియా వేదిక గా అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. కాగ వ‌న్డే జ‌ట్టుకు కెప్టెన్ మార్పు చేసిన నాటి నుంచి బీసీసీఐకి విరాట్ కోహ్లి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంది.