అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్,కూతురుకు కరోనా పాజిటివ్..!

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మరియు ఆయన కుమార్తె కరోనా బారినపడ్డారు. ఇప్పటికే ఇద్దరు కరోనా వ్యాక్సిన్ రెండు డోస్ లు తీసుకున్నట్లు తెలుస్తోంది. డింపుల్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు డోస్ ల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తనకు కరోనా సోకిందని అయితే తనకు ఎలాంటి లక్షణాలు లేవని డింపుల్ పేర్కొన్నారు.

కానీ ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. తనను కలిసిన వాళ్ళందరూ కరోనా టెస్టులు చేసుకోవాలని పేర్కొన్నారు. భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో అఖిలేష్ యాదవ్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నారు. కానీ అతనికి నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ భార్య, కూతురు అసోసియేషన్ లో ఉన్నారు. ఓవైపు కొత్త యూపీలో ఎన్నికలు దగ్గర పడుతుంటే ఇంట్లో కరోనా కలకలం రేగడంతో పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కరోనాతో డింపుల్ యాదవ్ ఐసోలేషన్ లో ఉండటంతో ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగింది.