మరోసారి వివాదంలో చిక్కుకున్న వైసీపీ కీలక నేత.. ఎవరో తెలుసా?

-

వైసీపీ కీలక నేత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఎవరంటే.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్న అంబటిని ప్రజెంట్ తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు? ఇంతకీ అంబటి రాంబాబు ఏ వివాదంలో చిక్కుకున్నారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే.

గతంలో సంజన అనే ఓ అమ్మాయితో ఎమ్మెల్యే అంబటి అసభ్యకరంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ఆడియో వైరల్ అయిన సంగతి అందరికీ విదితమే. కాగా తాజాగా మరోసారి అలాంటి రాసలీలల ఆడియో ఒకటి నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. ఈ ఆడియోను ఆధారం చేసుకుని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అంబటి రాంబాబును ట్రోల్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆడియోలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు అసభ్యకరంగా మాట్లాడారు. తాను గుంటూరు రావాలా? మీకు ఏం కావాల్నో చెప్పండని ఓ మహిళ అంబటితో ముచ్చటించింది. సదరు మహిళతో అంబటి రాంబాబు తనకు అన్ని కావాలని చెప్పినట్లు ఆడియో ద్వారా తెలుస్తోంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కాగా చివరకు అది అంబటి రాంబాబు వరకు వెళ్లింది. దాంతో ఆయన ఈ ఆడియో విషయమై స్పందించారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆడియోకు తనకు ఎటువంటి సంబంధం లేదని, అది ఫేక్ వీడియో అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు వీడియో కూడా విడుదల చేశారు వైసీపీ కీలక నేత అంబటి. ఫేక్ వీడియో విషయమై అంబటి త్వరలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారని అంబటి సన్నిహిత వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version