సిద్దిపేట కలెక్టర్ కు జగ్గారెడ్డి వార్నింగ్

-

సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రైతు తన స్వంత నిర్ణయం తో పంటలు వేయకూడదా.. ? సిద్ధిపేట కలెక్టర్ చెప్పిందే వేయాలా.. ? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. వెంటనే రైతులకు సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి క్షమాపణలు చెప్పాలి… సాయంత్రం లోగా క్షమాపణ లు చెప్పకపోతే.. సిద్ధిపేట కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సిద్ధిపేట జిల్లా లో ఏ పంట వేయాలనేది కలెక్టర్ నిర్ణయిస్తాడా.. ? అని నిలదీశారు.

jaggareddy | జగ్గారెడ్డి
jaggareddy | జగ్గారెడ్డి

ఏ అధికారంతో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నాడని ఫైర్ అయ్యారు. అవగాహన లేని వెంకట్రామిరెడ్డి ని కలెక్టర్ గా ఇన్నేళ్లు గా ఎందుకు కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. సిద్ధిపేట కలెక్టర్ మాటలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని.. రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. రైతులను ఇబ్బందులు నిర్ణయాలు తీసుకుంటే.. కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. వెంకట్రామిరెడ్డి మైండ్ లో రియల్ ఎస్టేట్ ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news