ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య వీడియో కాల్ !

-

ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య వీడియో కాల్ చేసిందని వార్తలు వస్తున్నాయి. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపా దేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది రూపా దేవి. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. గత 12 సంవత్సరాల క్రితం రూపదేవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.

రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్ లోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొంపల్లిబ్లోని గత సంవత్సర కాలంగా పేట్ బషీరాబాద్ లోని దవేరియా విల్లాస్ లోని నివాసం ఉండేది. గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. అటు భార్య మృతిని తట్టుకోలేక హాస్పటల్లో స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం. నిన్న అల్వాల్ నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండికి వెళ్లగా, సాయంత్రం ఆయనకు రూపాదేవి వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పారు. మేడిపల్లి సత్యం ఇంటికి చేరుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకోగా, విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం స్పృహ తప్పి పడిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news