హైదరాబాద్ వాసులకు అలర్ట్.. వారందరికీ నల్లా కనెక్షన్ కట్

-

పెండింగ్ బిల్లులపై హైదరాబాద్ జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎలాగైనా మొండి బకాయిలు వసూలు చేయాలని నిర్ణయించి. బకాయిదారులపై చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది. ఇప్పటికే భారీగా బకాయి పడిన ఇంటి ఓనర్ల లిస్టును  జలమండలి సిద్ధం చేసి ముందుగా ఇంటి ఓనర్లకు నోటీసులు అందించనున్నారు. నోటీలు ఇచ్చినా చెల్లించడానికి ముందుకు రాకపోతే ఇంటి నల్లాల కనెక్షన్లను తొలగించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.

10 వేల రూపాయల కంటే ఎక్కువ మెుండి బకాయిలు దాటిన గృహ, వాణిజ్య నల్లాలపై స్పెషల్ డ్రైవ్‌ చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. ఆయా ప్రభుత్వ సంస్థల బకాయిలు కూడా భారీగా పెరిగిపోయాయి. జల మండలి అధికారుల అంచనాల ప్రకారం.. ప్రస్తుతం మెుత్తం బకాయిలు రూ.15వందల కోట్లు దాటాయట. ఈ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయా శాఖ హెచ్‌ఓడీ (HOD)లకు జలమండలి అధికారులు లేఖలు రాయనున్నట్టు సమాచారం. నీటి బిల్లుల మొండి బకాయిలపై సీరియస్‌గా దృష్టి సారించాలని నిర్ణయించిన అధికారులు.. కఠిన చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news